‘సంక్రాంతికి వస్తున్నాం’మూవీ టీమ్ వెరైటీ ప్రమోషన్స్.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియోలు

by Hamsa |
‘సంక్రాంతికి వస్తున్నాం’మూవీ టీమ్ వెరైటీ ప్రమోషన్స్.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియోలు
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranti ki Vastunnam). ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే దీనిని ఎస్విసి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకొని ఆసక్తిని పెంచాయి. మరీ ముఖ్యంగా ఇందులోని గోదారి గట్టు మీద రామచిలకవే, మిను, పొంగల్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ వెరైటీగా ప్రమోషన్స్ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. వెంకటేష్ నటించిన సినిమాల గెటప్స్‌‌లో మూవీ టీమ్ కనిపించారు. ఘర్షణ గెట్ అప్‌లో దిల్ రాజు, చంటిగా ఐశ్వర్య, బొబ్బిలి రాజాగా మీనాక్షి, జయం మనదేరా గెట్ అప్ లో అనిల్ రావిపూడి దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వావ్ సూపర్ ప్రమోషన్స్ అదిరిపోయాయని కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed