sankranthiki vasthunnam: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన చానల్

by sudharani |   ( Updated:2025-02-10 11:01:41.0  )
sankranthiki vasthunnam: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన చానల్
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో పాటు సంక్రాంతి బరిలో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఇక ఈ మూవీ రిలీజై నెల కావస్తోన్న ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తూ కలెక్షన్లు రాబడుతోంది. ఇలా సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా.. మరోసారి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఊహించని ట్విస్ట్ ఇస్తూ టీవీ ప్రీమియర్‌ (TV premiere)కు సిద్ధం అయింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ. ఈ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న జీ సంస్థ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేసింది. జీ తెలుగు (Zee Telugu)లో త్వరలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీవీ ప్రీమియర్‌కు వస్తుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అంతే కాకుండా ఓటీటీ కంటే ముందు తొలిసారి టీవీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రాబోతుందని చెప్పుకొచ్చింది. అయితే.. త్వరలో అని ప్రకటించారు కానీ ఇంకా డేట్ మాత్రం అనౌన్స్ చెయ్యలేదు.

Next Story

Most Viewed