Akhanda-2: బాలయ్య సరసన మరో యంగ్ బ్యూటీ.. ‘అఖండ-2’ హీరోయిన్ ఫిక్స్!

by sudharani |
Akhanda-2: బాలయ్య సరసన మరో యంగ్ బ్యూటీ.. ‘అఖండ-2’ హీరోయిన్ ఫిక్స్!
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ప్రజెంట్ చిత్ర బృందం మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాలయ్య బాబు ప్రస్తుతం ‘అఖండ-2’ (Akhanda-2)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2021లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్, బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ-2’ తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రక్షకుల్లో పార్ట్ -2 పై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అంతే కాకుండా రీసెంట్‌గా కుంభమేళాలో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘అఖండ-2’కు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్‌ (Samyukta Menon)ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ (First look poster)ను రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా.. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట BB4 నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక అఖండ-2 చిత్రం ఈ ఏడాది దసర స్పెషల్‌గా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Next Story