ఆమె వల్ల నరకం అనుభవించా అంటూ.. అక్కినేని అమలపై సమంత షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2023-08-24 07:03:27.0  )
ఆమె వల్ల నరకం అనుభవించా అంటూ.. అక్కినేని అమలపై సమంత షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్‌గా క్రేజ్ తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఎవరి కెరీర్ ను వాళ్ళు చూసుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కానీ వీరిద్దరిని సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్‌గా మారుతూనే ఉంటాయి.

తాజాగా, ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమంత, నాగచైతన్యతో విడిపోయినప్పటికీ అమెరికా వెళ్లినప్పుడల్లా ఆయన తల్లి దగ్గుబాటి లక్ష్మిని కలుస్లుందట. అయితే రీసెంట్గా సమంత, శ్రీలక్ష్మిని కలిసినప్పుడు అమల గురించి నమ్మలేని నిజాలు బయటపెట్టినట్లు టాక్. ‘‘ఆ ఇంట్లో ఉండే మనుషులు మొత్తం విచిత్రమైన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో వాళ్లకే తెలియదు అని తన అత్తకు తెలిపిందట. ఒకానొక సందర్భంలో నా స్వేచ్ఛను మొత్తం పోగొట్టుకొని జైలులో ఉన్నట్లు అనిపించిందని, కష్టమైన ఆంక్షలు పెట్టే వారని ముఖ్యంగా అమల పెట్టే కండిషన్స్ నేను తట్టుకోలేక పోయేదాన్ని అంటూ సమంత, లక్ష్మికి చెబుతూ ఏడ్చేసిందట. అలాగే నాగచైతన్య కూడా తనను అపార్థం చేసుకున్నాడని దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని లక్ష్మికి సమంత చెప్పిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం ‘ఖుషి’ చిత్రంతో సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి న్యూయార్క్ చెక్కేసింది. అక్కడ పలు ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తుంది.

Read More: యంగ్ హీరోకు ఫుల్ సపోర్ట్‌గా మెగా ఫ్యామిలీ.. ఆ సినిమా కచ్చితంగా చూడాలంటూ స్పెషల్ పోస్ట్

Advertisement

Next Story