- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో పెళ్లి విషయంలో సమంత కఠిన నిర్ణయం.. తల్లి కావాలన్న కోరిక ఎలా తీర్చుకోనుందంటే?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గత కొద్ది కాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో పూర్తిగా సినిమాలపై దూరమై ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అలాగే పలు యాడ్ షూట్స్‌లోనూ పాల్గొని చేతినిండా సంపాదిస్తోంది. అయితే చాలా రోజుల తర్వాత సమంత ఇటీవల తన జీవితంలో జరిగిన సంఘటనలు, ఫెయిల్ అయిన పెళ్లి గురించి తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి సమంత సూపర్ స్టార్ అయ్యింది. ఆమెకు ఇండియా వైడ్ ఫేమ్ వచ్చింది. 14 ఏళ్ల కెరీర్ లో సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చింది.
తాజాగా, సమంతకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సమంతను రెండో పెళ్లి చేసుకోమని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నువ్వు లైఫ్‌లో ఎన్నో సక్సెస్‌లు అందుకున్నావు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని సలహా ఇస్తున్నారట. కానీ సామ్‌కు మాత్రం.. జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. ఇకపై ఒంటరిగా ఉండిపోవాలి అనుకుంటుందని తెలుస్తోంది. మిగిలిన జీవితం నటనకు, సోషల్ వర్క్ కి ఉపయోగించాలని భావిస్తుందట. ఇక తల్లి కావాలన్న ఆశను ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తీర్చుకోవాలని అనుకుంటుందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త తెలిసిన వారు మాత్రం షాక్ అవుతున్నారు. అలాగే సమంత ఫ్యాన్స్ కొందరు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.