SAMANTHA: హేమ కమిటీ రిపోర్ట్‌పై స్పందించిన సమంత.. అవి మహిళల కనీస అవసరాలంటూ సంచలన పోస్ట్

by Kavitha |   ( Updated:2024-08-29 14:12:05.0  )
SAMANTHA: హేమ కమిటీ రిపోర్ట్‌పై స్పందించిన సమంత.. అవి మహిళల కనీస అవసరాలంటూ సంచలన పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొంత కాలంగా మయోసైటీస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో అలరించడానికి మళ్లీ మన ముందుకు రాబోతుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ రూపొందించిన రిపోర్టులో షాకింగ్ విషయాలు బహిర్గతం అయ్యాయి. ఇది అంతటా చర్చకు దారి తీసింది. దీంతో పలు సినీ నటీనటులు ఈ కమిటీ రిపోర్టు పై స్పందించారు. ఈ క్రమంలో తాజాగా స్టార్ హీరోయిన్ సమంత స్పందిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ పోస్ట్‌లో భాగంగా.. “కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(WCC) అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్ల హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవ ప్రదమైన పని ప్రదేశాలు మహిళల కనీస అవసరాలు. అయినా వీటి కోసం ఇప్పటికీ ఎంతో మంది పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌లో ఉన్న నా స్నేహితులకు, సోదరి మణులకు కృతజ్ఞతలు” అని సమంత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Advertisement

Next Story