Samantha: ఆ థీమ్‌లో లేటెస్ట్ ఫొటో షూట్ చేసిన సమంత.. గార్జియస్ అంటున్న నెటిజన్లు

by Kavitha |
Samantha: ఆ థీమ్‌లో లేటెస్ట్ ఫొటో షూట్ చేసిన సమంత.. గార్జియస్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో రెండో పెళ్లి చేసుకున్నాడు.

సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel : honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ హెల్త్‌కి సంబంధించిన టిప్స్ చెప్పడంతో పాటు లేటెస్ట్ ఫొటో షూట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా సమంత తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ సూట్ వేసుకుని, హెవీ కాస్ట్ ఉన్న వాచ్‌తో పాటు రింగ్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని స్టైలీష్‌గా రెడీ అయింది. ఇక ఈ ఫొటోస్‌ను బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో షేర్ చేస్తూ.. ‘షి, అన్ ఫోల్డింగ్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పిక్స్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story

Most Viewed