Samantha : హ్యాపి బర్త్‌డే మై సూపర్ హీరో అంటూ అతనికి స్పెషల్‌గా విష్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్

by Kavitha |   ( Updated:2024-08-23 14:33:54.0  )
Samantha :  హ్యాపి బర్త్‌డే మై సూపర్ హీరో అంటూ అతనికి స్పెషల్‌గా విష్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది.

ఇదిలా ఉంటే.. తాజాగా సమంత.. నేడు యంగ్ హీరో తేజ సజ్జా పుట్టిన రోజు సందర్భంగా విష్ చేస్తూ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో భాగంగా.. “హ్యాపి బర్త్‌డే మై సూపర్ హీరో.. అంతకంతకు కష్టపడుతూ ఎదుగుతున్న నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ మిరాయ్ పోస్టర్‌కు ఈ క్యాప్షన్ జోడించింది. కాగా తేజ సజ్జా, సమంత కలిసి ‘ఓ బేబీ’ అనే సోషియో ఫాంటసీ కామెడీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ, రావు రమేష్ వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేశారు.

Advertisement

Next Story