నా సినిమా సేఫ్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన శైలేష్ కొలను.. కారణమేంటంటే..

by Kavitha |   ( Updated:2025-03-13 12:20:28.0  )
నా సినిమా సేఫ్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన శైలేష్ కొలను.. కారణమేంటంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్(Nani) నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి(Prashanthi) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కోర్టు(Court- State vs A Nobody). ఈ సినిమాలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్(Ram Jagadeesh) తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీలో శివాజీ(Shivaji), సాయి కుమార్(Sai kumar), రోహిణి(Rohini), హర్షవర్ధన్(Harsha Vardhan), శ్రీదేవి(Sridevi) వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గత ఏడాది ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

కాగా ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే రీసెంట్‌‌గా ప్రమోషన్స్‌లో భాగంగా నాని తాజాగా నాని కోర్ట్ సినిమా నచ్చకపోతే తన ‘హిట్- 3’(HIT-3)ని చూడకండని ఈవెంట్‌లో ఓ భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన ప్రాజెక్ట్ మీదున్న నమ్మకంతో రెండు రోజుల ముందే ఈ సినిమాను సెలెబ్రిటీలకు, మీడియాకి చూపించాడు. ఇక ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో తన సినిమా సేఫ్ అన్నట్టుగా డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) హ్యాపీ అవుతున్నాడు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ ట్వీట్ పెట్టాడు. ‘నా మూవీ సేఫ్.. కోర్టు సినిమా అద్భుతంగా, అందరికీ అవగాహన కల్పించేలా ఉంది. నాని అన్న, వాల్ పోస్టర్ బ్యానర్‌తో నాకు అనుబంధం ఉండటం ఎంతో గర్వంగా ఉంది. ప్రియదర్శి మరో ఆణిముత్యంలా నటించాడు. రామ్ జగదీష్ ఫస్ట్ మూవీతోనే అదరగొట్టేశాడు. ఇక తన సినిమాకు సంబంధించిన ఎడిట్ రూంలోకి వెళ్లాలి ఎందుకంటే చాలా పని ఉంది’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం శైలేష్ కొలను ట్వీట్ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed