Sai Pallavi: సాయి పల్లవి ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. డాక్టర్ ఏం చెప్పారంటే..?

by Prasanna |   ( Updated:2025-01-29 02:54:40.0  )
Sai Pallavi: సాయి పల్లవి ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. డాక్టర్ ఏం చెప్పారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) హిట్ కోసం చాలా కష్ట పడుతున్నాడు. గతంలో తీసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సారి ఎలా అయిన విజయం సాధించాలని కొత్త కథతో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ఇతని కెరియర్లో ఎన్నో సినిమాలు తీసినప్పటికీ, వాటిలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రూట్ మార్చి ఎప్పుడూ చేయని పాత్రతో మనల్ని అలరించడానికి వస్తున్నాడు. డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య కాంబోలో వస్తున్న మూడవ సినిమా " తండేల్ " ( Thandel ) . గీత ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చైతూకి జంటగా సరసన సాయి పల్లవి ( Sai Pallavi ) హీరోయున్ గా నటిస్తుంది.

లవ్ స్టోరీ వంటి హిట్ తర్వాత మరో సారి వీరి కాంబో రావడంతో ఆడియెన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో రానుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు. మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

" తండేల్ " ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ జరిగింది. హీరో నాగచైతన్య, డైరెక్టర్, నిర్మాత అల్లు అరవింద్ మాత్రమే హాజరయ్యారు. అయితే, హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఎక్కడా కనిపించలేదు. గత రెండు రోజుల నుంచి ఈ ముద్దుగుమ్మకి ఆరోగ్యం బాగలేదని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ మూవీ నిర్మాత అల్లు అరవింద్ ( Allu Aravind ) క్లారిటీ ఇచ్చారు. ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి అని.. డాక్టర్ కొన్ని రోజుల వరకు ప్రయాణాలు చేయోద్దని చెప్పారని..అందు వలనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని చెప్పారు. దీనిపై రియాక్ట్ అయిన ఆమె ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Advertisement

Next Story