Viral News : అర్జున్ రెడ్డిలో సాయి పల్లవి!

by M.Rajitha |
Viral News : అర్జున్ రెడ్డిలో సాయి పల్లవి!
X

దిశ, వెబ్ డెస్క్ : తన సెన్సేషనల్ సినిమాలతో టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీకి పిచ్చెక్కించి, భారీ హిట్లు అందుకున్న స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga). తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ తన మొదటి సినిమా గురించి సందీప్ రెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని ఈ మధ్య జరిగిన ఓ మూవీ ఈవెంట్ లో పంచుకున్నారు. అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాలో హీరోయిన్ గా తాను మొదట సాయి పల్లవి(Sai Pallavi)ని అనుకున్నానని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాచురల్ బ్యూటీ సాయి పల్లవిని తాను ప్రేమమ్(Premam) సినిమాలో చూశానని, అర్జున్ రెడ్డి సినిమాలో తను నటిస్తే బాగుంటుందని అనుకున్నట్లు తెలిపారు.

అందుకోసం ఆమె కోఆర్డినేటర్ ను సంప్రదించానని అయితే.. 'మీ సినిమాలో లవ్ స్టోరీ లేదు, కేవలం రొమాంటిక్ స్టోరీ ఉంది. సాయి పల్లవి ఈ సినిమాలో నటించడం విషయం మర్చిపోండి. ఆమె స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు' అని ఆయన చెప్పడంతో.. వేరే హీరోయిన్‌ ను సంప్రదించామన్నాడు. కాగా డైరెక్టర్ చందు మొండేటి(Chandu Mondeti) డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం "తండేల్"(Thandel) మూవీ ప్రీరిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన సందీప్ మాట్లాడుతూ.. తండేల్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏది చూసినా ఎమోషన్ కనిపిస్తోందని.. నాగ చైతన్య(Naga Chaithanya), సాయి పల్లవి తమతమ పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు. తాను 'కేడీ' చిత్రానికి పని చేస్తున్న సమయంలో చైతన్యను చూశానని.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్, కార్ డ్రైవింగ్ తనకు చాలా ఇష్టమన్నాడు.

కబీర్ సింగ్(Kabeer Singh), యానిమల్(Animal) సినిమాల విషయంలో డిజైనర్ కు చైతన్య కాస్ట్యూమ్స్ రిఫెరెన్స్ గా చూపించేవాడినని తెలిపాడు. ప్రేమమ్ సినిమా నుంచి సాయి పల్లవికి అభిమానిగా మారిపోయానని తెలిపిన సందీప్ అర్జున్ రెడ్డి సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ తీసుకోవాలనుకున్నట్లు పేర్కొన్నాడు. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేశాక హీరోయిన్స్ తమ అభిప్రాయాలు మార్చుకొని అన్ని రోల్స్ కి ఒకే చెబుతారని, కానీ సాయి పల్లవి మాత్రం 10 ఏళ్ల నుంచి తన విలువలతోనే కొనసాగుతూ హిట్ సినిమాలను సొంతం చేసుకుంటోందని కొనియాడారు. కాగా సందీప్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed