- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ROJA: స్టార్ హీరో కొడుకుతో రోజా కూతురు పెళ్లి.. స్వయంగా క్లారిటీ ఇస్తూ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, వైసీపీ మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. ఆ తర్వాత ‘జబర్దస్త్’ షోకి జడ్జ్‌గా వ్యవహరించింది. అలా అక్కడ చేస్తునే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె.. తర్వాత మంత్రి అయింది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో రోజా ఘోరంగా పరాజయం పొందింది. ఈ క్రమంలో రోజా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. ‘మీ అమ్మాయి అన్షు మాలిక ఓ స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతుందనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి ఇది నిజమేనా’ అని అడుగగా.. దానికి రోజా స్పందిస్తూ.. ‘అవునా.. నా వరకు ఈ పుకారు రాలేదు. అన్షు మీద తరచూ గాసిప్స్ వైరల్ అవుతుంటాయి. పై చదువుల కోసం అమెరికా వెళితే.. అక్కడ డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకుంటుందని రాశారు. అన్షు హీరోయిన్ అవుతాను అంటే నాకు ఇష్టమే. నేను ప్రోత్సహిస్తాను. కానీ సైంటిస్ట్ కావాలనేది అన్షు డ్రీమ్. మా అమ్మాయి స్టార్ హీరో ఇంటి కోడలు అవుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అంటూ ఆ పుకార్లను రోజా కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.