- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shanmukh Jaswanth : అన్నీ గుర్తుచేసుకొని స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న ‘షన్ను’..
దిశ, వెబ్ డెస్క్ : షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ.. యూట్యూబ్ స్టార్ గా షణ్ముఖ్ జశ్వంత్ ( Shanmukh Jaswanth ) మంచి గుర్తింపు పొందాడు. తన వెబ్ సిరీస్ లతో ఆడియెన్స్ కు మరింత దగ్గరై తెలుగులో ఎక్కువ సబ్ స్క్రయిబర్స్ కలిగిన యూట్యూబర్ గా రికార్డ్ క్రియోట్ చేశాడు. ఆ తర్వాత దీప్తి సునైనాతో లవ్, ఆమెతో బ్రేకప్ వలన బాగా వైరల్ అయ్యాడు. ఇటీవలే గంజాయి కేసులో చిక్కుకుని వార్తల్లో నిలిచాడు.
ఎప్పటికైనా హీరో అవుతాడనుకున్న షణ్ముఖ్ ఏడాది గ్యాప్ తీసుకుని ఇప్పుడు హీరోగా ఓటీటీ మూవీతో గ్రాండ్ గా కంబ్యాక్ ఇస్తున్నాడు. షణ్ముఖ్, అనఘ కలిసి జంటగా నటించిన "లీల వినోదం" మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. " వైజాగ్ లోనే నా జర్నీ స్టార్ట్ అయింది. నాకు ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ చేయలేదు లేదు. నేను, చేయని కొన్ని తప్పులకు కూడా నన్ను నిందించారు. నా మీద నెగిటివిటి చూపించారు. నేను తట్టుకున్నాను కానీ మా ఫ్యామిలీని కూడా నెగిటివిటి చూపించారు. అమ్మా నాన్నా సారీ. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా.. మీరు నాకు సపోర్ట్ చేసారు. సక్సెస్ లో ఉన్నప్పుడు మన పక్కన అందరూ ఉంటారు. కానీ, మనం పడినప్పుడు మన పక్కన ఉండే వాళ్ళే నిజమైన స్నేహితులు " అంటూ ఎమోషనల్ అయి స్టేజిపైనే ఏడ్చేశాడు.