ఆ స్టార్ హీరో సినిమాలో చాన్స్ కొట్టేసిన రవితేజ హీరోయిన్.. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమే అంటున్న ఫ్యాన్స్

by Kavitha |
ఆ స్టార్ హీరో సినిమాలో చాన్స్ కొట్టేసిన రవితేజ హీరోయిన్.. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమే అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) సరసన ‘మిస్టర్ బచ్చన్’(Mister Bachchan) సినిమాలో నటించింది. ఇక ఈ చిత్రంతోనే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ బ్యూటీ మాత్రం ఈ మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తన క్యూట్ క్యూట్ అందంతో ఆడియన్స్‌ను మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇందులో భాగంగా టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అయినటువంటి రామ్ పోతినేని(Ram Pothineni) సరసన ‘రాపో-22’(Rapo-22) మూవీలో నటిస్తోంది. అంతేకాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా అతనితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ నటిస్తున్న ‘కాంత’(Kantha) సినిమాలో కూడా భాగ్యశ్రీ నటిస్తోంది. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేస్తూ కన్ఫమ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ భామ మరో స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్నదట. మరి ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం..

స్టార్ హీరో సూర్య(Surya) వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారని సమాచారం. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, నెటిజన్లు ఈ కాంబో ఫిక్స్ అయితే మాత్రం ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed