The Girlfriend : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

by Prasanna |
The Girlfriend : రష్మిక  ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ  టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం, హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna) పుష్ప 2 ( Pushpa 2) గొప్ప విజయం సాధించడంతో సంతోషంగా ఉంది. వరుస హిట్స్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న రష్మిక త్వరలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ ( The Girlfriend) అనే మూవీతో మన ముందుకు రానుంది. గీత ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకం పై అల్లు అరవింద్, మారుతి నిర్మాణంలో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కింది. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన రష్మిక పోస్టర్స్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం, షూటింగ్ జరుపుకుంటున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి తాజాగా టీజర్ ను విడుదల చేశారు.విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేశాడు. ఈ టీజర్ కి విజయ్ దేవరకొండ వాయిస్ ఇవ్వడంతో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. రష్మిక మందన్న ఓ కాలేజీలో జాయిన్ అవ్వడం, ఒక అబ్బాయితో ప్రేమలో పడటం, ఆ తర్వాత ప్రేమలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొందనేవి టీజర్లో చూపించారు. ఈ టీజర్ చూస్తుంటే వన్ సైడ్ లవ్ స్టోరీ మూవీగా తీసినట్లు అర్ధమవుతుంది.

Advertisement

Next Story