- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘సారీ మై లవ్స్ ఆలస్యంగా విష్ చేస్తున్నందుకు’: రష్మిక మందన్న

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crush Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఛలో (Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే అల్లరి, చిలిపితనం, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ ముద్దుగుమ్మ ఏ ముహూర్తాన సినీ పరిశ్రమకు అడుగుపెట్టిందో తెలియదు కానీ టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా..మలయాళం, హిందీ, తమిళం భాషల్లో కూడా నటించి జనాల్ని మెప్పిస్తుంది. ముఖ్యంగా పుష్ప రెండు భాగాల్లో నటించి పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. రణబీర్ కపూర్ సరసన యానిమల్ (Animal) సినిమాలో కూడా నటించింది. అలాగే రష్మిక మందన్న నటించిన ఛావా చిత్రం కూడా జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
నేషనల్ క్రష్ మహారాణి పాత్రలో నటించి నెటిజన్లను ఆకట్టుకుంది. నిండైన చీరకట్టులో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె గీత గోవిందం (Geeta Govindam), డియర్ కామ్రేడ్ (Dear Comrade), యజమన, దేవదాస్, భీష్మ (Bhishma), సరిలేరు నీకెవ్వరు, పుష్ప, వెంకీ కుడుములు (Venki kuḍumulu), ఆడవాళ్లు మీకు జోహార్లు, గుడ్ బై (Good bye), వారసుడు, మజ్ను, పుష్ప-2 వంటి సినిమాల్లో నటించింది.
ఇకపోతే నిన్న (మార్చి 14) రెండు తెలుగు రాష్ట్రాలు హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, బుల్లితెర నటీనటులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అయితే నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిన్న సోషల్ మీడియా వేదికన హోలీ శుభాకాంక్షలు తెలుపలేదు.
కాగా నేడు సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సారీ మై లవ్స్ హోలీ విషెష్ ఆలస్యంగా చెబుతున్నందుకు అని రాసుకొచ్చింది. అలాగే తన ఫొటో కూడా పంచుకుంది. ప్రస్తుతం రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.
READ MORE ...
Pooja Hegde: రాణి పింక్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన గోపికమ్మ.. ఆకట్టుకుంటోన్న పిక్స్ వైరల్