- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Super buzz: ఫౌజీలో యువరాణి పాత్రలో నటించనున్న రామ్ చరణ్ బ్యూటీ.. వావ్ సూపర్ అంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల ‘సలార్’(Salar) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ప్రభాస్ రాజాసాబ్(Rajasab), స్పిరిట్, సలార్-2, కల్కి-2, వంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే డార్లింగ్ ‘కన్నప్ప’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా సీతారామం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల ‘సలార్’(Salar) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.ఫేమ్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘పౌజి’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్(Alia Bhatt) యువరాణి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఆమె పాత్ర కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ అలియా భట్‌ను సంప్రదించగా.. దీనికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఆమె గెస్ట్ రోల్ చేస్తుందా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది తెలుసుకున్న నెటిజన్లు వావ్ సూపర్ అని అంటున్నారు.
కాగా.. అలియా భట్ హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇటీవల ‘జిగ్రా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక తెలుగులో ఆమె ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’మూవీలో సీత పాత్రలో నటించి మెప్పించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇందులో నటించిన నటీనటులకు ఫుల్ క్రేజ్ వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.