Pushpa 2: ఇండియా మొత్తం ‘పుష్ప-2’ రికార్డుల మోత.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందంటే?

by Hamsa |   ( Updated:2024-12-11 06:38:02.0  )
Pushpa 2: ఇండియా మొత్తం ‘పుష్ప-2’ రికార్డుల మోత.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందంటే?
X

దిశ, సినిమా: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun), బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌(Sukumar) కాంబోలో వచ్చిన మూవీ ‘పుష్ప-2 ది రూల్‌’(Pushpa 2: The Rule ). ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం విడుదల రోజు ప్రీమియర్‌స్‌(Premieres) నుంచే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఈ సినిమా మొదటి రోజు, రెండవరోజు, మూడవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన ‘పుష్ప-2’ తాజాగా నాలుగో రోజు రూ. 829 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు(All-time record) సృష్ఠించింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా 'పుష్ప-2' ది రూల్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేసింది. ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న ‘పుష్ప-2’ ముఖ్యంగా బాలీవుడ్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో ఒక్క రోజులోనే రూ.86 కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెర లేపింది. ఇంత త్వరగా అంటే కేవలం నాలుగు రోజుల్లోనే 291 కోట్లు కలెక్ట్‌ చేసిన హిందీ చిత్రంగా నిలిచింది.

Next Story