- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mad Square: సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం.. హైప్ పెంచేస్తున్న హీరోలు

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’ (Mad)కి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) వస్తున్న విషయం తెలిసిందే. నార్నే నితిన్ (Narne Nitin), సంగీత్ శోభన్ (Sangeet Shobhan), రామ్ నితిన్ (Ram Nitin), విష్ణు ఓఐ (Vishnu oi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీనికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టకోగా.. తాజాగా వచ్చిన టీజర్ (Teaser)కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తుంది. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ మేరకు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మాట్లాడుతూ.. ‘మీరు టీజర్‌లో చూసింది చాలా తక్కువ. మ్యాడ్ స్క్వేర్‌లో మీ అంచనాలకు మించిన ఎంటర్‌టైన్మెంట్ (Entertainment) ఉంటోంది. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. అంతే కాదు.. మ్యాడ్ సినిమా సమయంలో నిర్మాత వంశీ ఒక మాట చెప్పారు.. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని. ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నా.. ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం (నవ్వుతూ). మళ్ళీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం’ అంటూ చెప్పుకొచ్చారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) మాట్లాడుతూ.. ‘మంచి సినిమా తీశాము. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి. స్నేహితులతో కలిసి మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) మాట్లాడుతూ.. ‘మ్యాడ్ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు. 'మ్యాడ్ స్క్వేర్' అయితే దానికి పది రెట్లు ఉంటుంది. ప్రతి సీనూ మిమ్మల్ని నవ్విస్తుంది. మార్చి 29న విడుదలవుతున్న మా సినిమాని చూసి ఆదరించండి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే నమ్మకం ఉంది’ అన్నారు.