- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Mallika: మరోసారి దర్శకుడి తల్లి సెన్సేషనల్ కామెంట్స్.. ఆ సమయంలో ఆయన?

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే పృథ్వీరాజ్ (Prithviraj) తల్లి మల్లిక (Mallika) వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన కొడుకును బలి పశువును చేయాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఎల్2: ఎంపురాన్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇకపోతే తాజాగా మల్లిక మరోసారి సోషల్ పలు కామెంట్లు చేశారు. రంజాన్ సందర్భంగా మమ్ముట్టి తనకు చేసి.. బాధపడవద్దని చెప్పారని తెలిపారు.
అలాగే ఈ మూవీ పరంగా జరుగుతున్న వివాదం.. తన ఫ్యామిలీని ఎంత బాధపడుతుందో ఆయనకు అర్థం అయిందని.. కాగా ఫేస్‌బుక్‌లో తన పోస్ట్ వీక్షించాక మమ్ముట్టి (Mammootty) ధైర్యం చెప్పారని వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలో తనకు సపోర్ట్‌గా నిలిచిన వారు కేవలం మమ్ముట్టినేనని అన్నారు. ఆయన మెసేజ్ చూసి ఎమోషనల్ అయ్యానని, పృథ్వీరాజ్‌కు కూడా చూపించి ధైర్యం చెప్పానని పేర్కొన్నారు. మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.