- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభాస్ షూటింగ్‌లో అలా చేశాడు.. అతనితో డేటింగ్ చేయాలని ఉందంటూ నటి షాకింగ్ కామెంట్స్!

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అంటే ఇష్టపడని వారుండరు. ఆయన అందానికి ఎంతో మంది అమ్మాయిలు ఫిదా అయిపోయి ఆయనతో పెళ్లైనట్లు కలలు కంటారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రభాస్ చాలామంది సినీ సెలబ్రిటీలకు తన ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్ పంపిస్తాడన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ సైతం ఆయన ప్రేమకు అడిక్ట్ అయిపోయారు. అయితే డార్లింగ్ 45 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆయనను పెళ్లి చేసుకోవాలని ఉన్నట్లు ఎంతో మంది హీరోయిన్ కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఎవరిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఇక ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) కూడా డార్లింగ్ లాంటి భర్త కావాలని ఉందంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, బోల్డ్ బ్యూటీ ముమైత్ ఖాన్(Mumait Khan) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘రెబల్ స్టార్ చాలా సిగ్గు పడుతుంటారు. సినిమా సెట్స్‌లో సైలెంట్‌గా ఉంటారు. అయితే ‘యోగి’ షూటింగ్ సమయంలో నేను ఆయనను విపరీతంగా ఆటపట్టించాను. ఇక నా టీజింగ్‌ను భరించలేక నాపై కొరాయోగ్రాఫర్‌కు కంప్లైంట్ చేశారు.అయినా నేను నా పద్ధతి మార్చుకోకుండా ఆయనను అలానే టీజ్ చేశాను. మొత్తానికి షూటింగ్‌లో ప్రభాస్‌తో ఫన్ క్రియేట్ చేశాం. అతను నాకు మంచి ఫ్రెండ్.. నిజంగా డార్లింగ్ లాంటి వాడు. ఎవరైనా ఎవరితో డేటింగ్‌కు వెళ్తావ్ అని అడిగితే వెంటకే ప్రభాస్‌తో అని చెప్పేస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముమైత్ ఖాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.