- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గుహల్లో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ బ్యూటీ.. షాక్‌లో నెటిజన్లు!(పోస్ట్)

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ఇటీవల విక్రమ్ సరసన ‘తంగలాన్’(Thangalan) మూవీలో నటించింది. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై విజయం సాధించింది. దీంతో ఈ అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటూ బిజీ అయిపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజాసాబ్’(Rajasab)లో హీరోయిన్‌గా నటిస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. మాళవిక సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. వరుస ఫొటోషూట్స్‌తో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా, ఈ అమ్మడు చుట్టూ గుహలు ఉండగా.. అక్కడ నీటి మధ్యలో నిల్చుని ఫొటోలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా షేర్ చేస్తూ.. ‘‘నేను దాదాపు ఒక దశాబ్దం క్రితం మెక్సికో(Mexico)లోని సెనోట్స్ గురించి చదివాను. అవి నాకు చాలా దూరంగా ఉన్నాయని అర్థం అయింది. దీంతో ఏదో ఒక రోజు అక్కడి ప్రదేశాన్ని ఆస్వాదించాలని మాత్రమే నేను ఆశించాను. అనుకున్నట్టుగానే వచ్చాను. సెనోట్లు లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
అవి పాతాళానికి పవిత్రమైన గేట్‌వేలుగా పరిగణించబడ్డాయి. దీనిని చనిపోయినవారి రాజ్యం అయిన ‘జిబాల్బా’(Xibalba) అని పిలుస్తారు. సెనోట్‌లు దేవతలు నివసించే ప్రదేశం అని మాయ విశ్వసించింది. లోపల ఉన్న నీరు దైవానికి ప్రత్యక్ష లింక్‌గా కనిపిస్తుంది. దేవతలను శాంతింపజేయడానికి లేదా మార్గనిర్దేశం చేసేందుకు నైవేద్యాలు , మానవ బలితో సహా మతపరమైన ఆచారాల కోసం సినోట్‌లను తరచుగా ఉపయోగించారని తెలుసుకున్నా’’ అని గుహల గురించి వివరించింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు అక్కడ ఫొటోలు ఎలా తీశారని అంటున్నారు.