- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పవన్ స్థానంలో రామ్ చరణ్.. ఫ్యాన్స్‌కు భారీ ట్విస్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ!
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్నంత క్రేజ్ మరే హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుని గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ మధ్య కాలంలో వరుస చిత్రాలతో హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. కానీ విడుదలకు నోచుకోవట్లేదు. వాయిదాలు పడుతూ వస్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ అదిరిపోయే న్యూస్ నెట్టింట లీక్ అయింది. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ బయటకు రావడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల కానుందని సమాచారం. అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ప్లేస్‌లో రామ్ చరణ్ రాబోతుండటంతో ట్విస్ట్ అదిరిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి తెలిసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏదైతేనేం ఏదో ఒక సినిమా అయితే కచ్చితంగా రిలీజ్ చేయండని అంటున్నారు.