- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు BIG షాక్.. 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా..?

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu). జ్యోతికృష్ణ(Jyothi Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం(AM Rathnam) నిర్మిస్తున్నారు. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే మార్చి 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. చిత్ర షూటింగ్ ఇంకా మిగిలి ఉండటం, పవన్ డేట్స్ సర్దుబాటు చేయకపోడంతో ఆ తేదీన విడుదల కావడం కష్టంగా కనిపిస్తోంది.
అయితే, అదే తేదీన నితిన్ 'రాబిన్ హుడ్'(Robin Hood) మరుసటి రోజు 'మ్యాడ్ స్క్వేర్'(Mad Squire) సినిమాలు వస్తుండటం పవన్ సినిమా వాయిదా వార్తలకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఈ వార్తలపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఇటీవలే ‘హరి హర వీరమల్లు’ మూవీ నుంచి తొలిపాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘మాట వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్ కల్యాణ్ ఆలపించారు. కీరవాణి స్వరాలు అందించారు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాన్ ఫోక్ సాంగ్ పాడటంతో ఆ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ పాటను స్వయంగా పవన్ కల్యాణే ఐదు భాషల్లో పాడటం విశేషం. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.