- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. బ్యూటీ ఆఫ్ వరల్డ్ అంటూ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత శుభాష్(Praneetha Shubhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో సిద్ధార్థ్(Sidharth) నటించిన ‘బావ’(Bava) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే తన నటనతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది.
అలా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi), ‘పాండవులు పాండవులు తుమ్మెద’(Pandavulu Pandavulu Tummeda), ‘రభస’(Rabhasa), ‘డైనమైట్(Dynamaite), ‘హలో గురు ప్రేమ కోసమే(Hello Guru Prema Kosame) వంటి సినిమాల్లో నటించి అలరించింది. అయితే ఇక్కడ కూడా అంతగా పాపులారిటీ తెచ్చుకోలేక పోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి సోషల్ మీడియా(Social Media)కే పరిమితం అయింది. ఇక అక్కడ తన లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ప్రణీత శుభాష్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ బ్లౌజ్ అండ్ దుప్పట్టా, వైట్ అండ్ గోల్డ్ మిక్స్డ్ కలర్ లెహంగా వేసుకుని ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. అలాగే తన నడుము కనిపించేటట్టు ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చి యూత్‌ను రెచ్చగొడుతోంది. ఇక ఈ పిక్స్‌కు ‘మన సంస్కృతులు, సంప్రదాయాలలో అపరిమితమైన అందం ఉంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోస్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు బ్యూటీ ఆఫ్ వరల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి. కాగా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రణీత ఓ బిజినెస్ మ్యాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరికి ప్రేమకు గుర్తుగా ఫస్ట్ పాప పుట్టగా.. రీసెంట్‌గా ఓ బాబుకు జన్మనిచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. కానీ సినిమాల్లో రీ ఎంట్రీ గురించి మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వడంలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.