అచ్చ తెలుగు అమ్మాయిలా రెడీ అయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇంట్లో పూజ కోసమంటూ పోస్ట్

by Kavitha |
అచ్చ తెలుగు అమ్మాయిలా రెడీ అయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇంట్లో పూజ కోసమంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరో సిద్ధూ(Sidhdhu) సరసన ‘బావ’(Bava) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే తన నటనతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది.

అలా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi), ‘పాండవులు పాండవులు తుమ్మెద’(Pandavulu Pandavulu Tummeda), ‘రభస’(Rabhasa), ‘డైనమైట్’(Dynamite), ‘హలో గురు ప్రేమ కోసమే’(Hello Guru Prema Kosame) వంటి చిత్రాల్లో నటించి అలరించింది. అయితే ఇక్కడ కూడా అంతగా పాపులారిటీ తెచ్చుకోలేక పోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి సోషల్ మీడియా(Social Media)కే పరిమితం అయింది. ఇక అక్కడ తన లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా ప్రణీత శుభాష్ తన ఇన్‌స్టా(instagram) వేదికగా ఓ ఫొటో షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ బ్లౌజ్, లైట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని, ఒంటినిండా నగలు అలంకరించుకుని అచ్చ తెలుగు అమ్మాయిలా ముస్తాబయింది. ఇక ఈ ఫొటోకి ‘ఇంట్లో పూజ కోసం ఇలా రెడీ అయ్యానంటూ’ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ‘బాపుబొమ్మ’, ‘సూపర్’, ‘ప్యూర్ బ్యూటీకి ఫర్‌ఫెక్ట్ ఎగ్జామ్‌పుల్ నువ్వు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడితో పెళ్లి పీటలెక్కింది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఈ జంటకి ఒక పాప పుట్టింది. మళ్లీ రీసెంట్‌గా ఒక బాబు కూడా జన్మనిచ్చింది. ఇక ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

Advertisement
Next Story

Most Viewed