- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vijay Antony: ‘పరాశక్తి’ టైటిల్ వివాదం.. కీలక ప్రకటన విడుదల చేసిన విజయ్ ఆంటోని పోస్ట్ వైరల్

దిశ, సినిమా: కోలీవుడ్ ఇండస్ట్రీలో ‘పరాశక్తి’ టైటిల్ గురించి తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల సినిమాలకు ఒకే టైటిల్ పెట్టడంతో సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ గంట వ్యవధిలోనే ప్రకటించిన మేకర్స్ సైతం షాక్‌కు గురయ్యారనడంలో అతిశయోక్తి లేదు. ఒకే టైటిల్‌తో రాబోతుండటంతో అందరిలో ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా కావాలనే హైప్ పెంచుకునేందుకు ఈ టైటిల్ పెట్టాడని విజయ్ ఆంటోనిని తప్పుపట్టారు. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వార్ జరుగుతోంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఈ విషయంపై కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘విజయ్ ఆంటోని పిక్చర్స్(Vijay Antony Pictures) బ్యానర్‌పై నేను గతేడాది జూలై నెలలోనే దీనిని రిజిస్టర్ చేయించుకున్నాను. తెలుగులో నేను ‘పరాశక్తి’ (Parashakti)అనే టైటిల్‌ను ఉపయోగించుకునేలా ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ల దగ్గరి నుంచి అధికారిక పత్రాన్ని నేను తెచ్చుకున్నాను అని తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. కాగా, విజయ్ ఆంటోని, వెంకట్ ప్రభు(Venkat Prabhu) కాంబోలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. దీనిని విజయ్ ఆంటోనీ పిక్చర్స్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని(Meera Vijay Antony) నిర్మిస్తోంది.
అయితే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విజయ్ 25వ చిత్రంగా రాబోతుంది. కాగా, ‘పరాశక్తి’ పేరుతోనే కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) మూవీ కూడా రాబోతుంది. ఇది ఆయన 25వ చిత్రంగా రాబోతుండటం విశేషం. సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో జయం రవి(Jayam Ravi), అథర్వ మురళి(Atharva Murali) కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా జనవరి 29న విడుదల అయింది. దీంతో ‘పరాశక్తి’ టైటిల్ వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే విజయ్ స్పందించడంతో అంతా ఆలోచనలో పడ్డారు. ఇద్దరిలో ఎవరు టైటిల్ మార్చుకుంటారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.