NTR 'Devara': జపాన్‌లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2025-02-25 11:42:07.0  )
NTR Devara: జపాన్‌లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ (Devara). డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) తెరకెక్కించిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొంది గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో తెలుగు తెరపై అడుగు పెట్టింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అంతే కాకుండా ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్-2 కూడా ఉందని చిత్ర బృందం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రజెంట్ పార్ట్-2పై ఫోకస్ పెట్టిన మేకర్స్ ఆ పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ‘దేవర’ మూవీ త్వరలో జపాన్‌(Japan)లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో మార్చి 22 నుంచి అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొననున్నాడు ఎన్టీఆర్. ఇందులో భాగంగా తాజాగా జపాన్ మీడియా (Japanese media)తో వీడియోలో ముచ్చటించాడు ఎన్టీఆర్. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంటూ.. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మార్చి 22 నుంచి తన పర్యటనను స్టార్ట్ చెయ్యనున్నారు. దాని కంటే ముందు జపనీస్ మీడియా (Japanese media) కోసం ఇంటర్వ్యూ (Interview)లతో ‘దేవర’ ప్రమోషన్‌లను ప్రారంభించాడు. మార్చి 28న జపాన్‌లో ‘దేవర’ గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కౌంట్‌డౌన్ స్టార్ట్’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed