- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Unstoppable Show: ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిచ్చే న్యూస్.. బాలయ్యతో కలిసి సందడి చేయనున్న గ్లోబల్ స్టార్
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్లో అడుగుపెట్టి సెవెన్ ఎపిసోడ్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి లాస్ట్ టైం విక్టరీ వెంకటేష్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలయ్య షోకి రానున్నట్లు తెలుస్తోంది. రేపు (డిసెంబర్ 31న) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చరణ్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అంజలీ, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్‌లు కీలక పాత్రలను పోషించారు.