- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నా మహారాజు అంటూ అతనితో ఉన్న ఫొటోలు షేర్ చేసిన రష్మిక మందన్న.. ట్విస్ట్ మామూలుగా లేదంటున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇక ‘పుష్ప’(Pushpa) మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే ఫేమ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ‘యానిమల్’(Animal) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
అయితే తెలుగులో కూడా రీసెంట్‌గా పుష్పకి సీక్వెల్‌గా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2) కూడా మంచి విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మించారు.
ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయింది. అలా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో పాటు కలెక్షన్ల వసూళ్లు సాధింస్తోంది. దీంతో మూవీ టీమ్ ప్రస్తుతం సక్సెస్ బిజీలో ఉన్నారు. ఈ క్రమంలో రష్మిక మందన్న పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా నేషనల్ క్రష్ తన ఇన్‌స్టా గ్రామ్(Instagram)లో ఓ పోస్ట్ పెట్టింది.
అందులో విక్కీ కౌశల్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మహారాజు, మహారాణి అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ ట్విస్ట్ ఊహించలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో సీక్రెట్ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్లు పలుమార్లు మీడియాకు కూడా చిక్కారు. కానీ వీరి రిలేషన్‌పై ఇప్పటి వరకు ఆ జంట స్పందించలేదు. అయితే మహారాణి గారి రాజు విజయ్ కావాలి కానీ విక్కీ కౌశల్‌ను మహారాజుగా పరిచయం చేసిందిగా అంటూ ఫ్యాన్స్ కామెడీగా కామెంట్లు చేస్తున్నారు.