ఈ హీరోయిన్ నటిస్తే డిజాస్టరేనా.. మరి పవన్ కల్యాణ్ సినిమా కూడా..

by Hamsa |   ( Updated:2023-08-29 08:39:37.0  )
ఈ హీరోయిన్ నటిస్తే డిజాస్టరేనా.. మరి పవన్ కల్యాణ్ సినిమా కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ సాక్షి వైద్య అక్కినేని అఖిల్‌ ‘ఏజెంట్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘గాండీవధారి అర్జున’ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా ఈ రెండు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచి నిర్మాతలను నిలువునా ముంచేశాయి. ఏజెంట్ ఫుల్ రన్ లో 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించలేదు. గాండీవధారి అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్ కోటి రూపాయల కంటే తక్కువ మొత్తంగా ఉండటం గమనార్హం.

ఈ రెండు సినిమాలు ఒకే తరహా కథాంశంతో తెరకెక్కాయి. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు సాక్షి వైద్యది కూడా పూజా హెగ్డే లాగా ఐరన్ లెగ్ అని ఆమె నటించిన సినిమా కచ్చితంగా డిజాస్టర్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాలో సాక్షి వైద్యను హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. దీంతో ఇది నిజం కాకపోతే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలుస్తుందోమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story