- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వ్యాపారవేత్తతో నేషనల్ క్రష్ డేటింగ్.. ఒక్క పోస్ట్‌తో షాకిచ్చిన బ్యూటీ!

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హిందీ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక 2023లో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ‘యానిమల్’(Animal )సినిమాలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో త్రిప్తి పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా.. రూ.900 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఇక ఇందులో త్రిప్తి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ వరుస పోస్టులతో ఏకంగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది.
ఏకంగా స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అమ్మడు అందాలకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ‘యానిమల్’తర్వాత త్రిప్తికి వరుస అవకాశాలు వచ్చాయి. గత ఏడాది.. ఈ అమ్మడు ‘బ్యాడ్ న్యూజ్’(Bad News) చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘ధడక్-2’లో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది(Siddharth Chaturvedi) సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే ‘ఆషికి-3’లోనూ ఈ అమ్మడు ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, త్రిప్తి పెట్టిన పోస్ట్ చర్చకు దారితీసింది. వ్యాపారవేత్త బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.
‘‘హ్యాపీ బర్త్ డే సామ్ మర్చంట్. మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చింది. అలాగే అతనితో తీసుకున్న ఫొటోలు కూడా షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు త్రిప్తి, మర్చంట్ డేటింగ్‌లో ఉన్నారని చర్చించుకుంటున్నారు. ఇక కొంతకాలంగా వస్తున్న వీరిద్దరి డేటింగ్ రూమర్స్‌కు ఆమె పోస్టుతో బలం చేకూరినట్లు అయింది. పెద్ద షాకిచ్చిందిగా అని కొందరు నెటిజన్లు అంటున్నారు. కాగా, సామ్ మర్చంట్ ఒకప్పుడు మోడల్ రాణించిన ఆయన గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటల్స్ నడిపిస్తూ చేతినిండా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు వ్యాపారం చేస్తూనే ట్రావెల్ వ్లాగర్‌గా కూడా రాణిస్తున్నాడట.