- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోకు 50ఏళ్లంటూ స్పెషల్ వీడియో షేర్ చేసిన కింగ్ నాగార్జున

దిశ, సినిమా: కింగ్ నాగార్జున(Nagarjuna) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లుదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios)ను నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసి అందరికీ సంక్రాంతి(Sankranthi) శుభాకాంక్షలు తెలిపారు. బండలు, రాళ్ళురప్పలున్న చోట అన్నపూర్ణ స్టూడియోకు పునాదులు పడ్డాయని అక్కినేని నాగార్జున వెల్లడించారు. సరిగ్గా సంక్రాంతి పండుగ రోజునే స్టూడియో ప్రారంభమైందని, అప్పటి నుండి ప్రతి సంక్రాంతికి ఇక్కడకు వచ్చి అందరితోపాటు కలిసి టిఫెన్ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
ఇప్పటికీ అదే కొనసాగుతుందన్నారు. ఎంతో మందికి ఏఎన్నాఆర్ స్ఫూర్తి అని చెప్పారు. అసలు రోడ్లే లేని రోజుల్లో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారని తెలిపారు. ఆ స్టూడియోలోని ప్రతీ స్థలం తన తల్లిదండ్రులు ఫేవరెట్ స్పాట్ అని అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుందని సామెతకు అనుగుణంగా… తన తండ్రి ఎఎన్నార్ విజయం వెనుక తన తల్లి అన్నపూర్ణమ్మ(Annapurnamma) ఉన్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి మీరు ఇప్పుడు ఇంత అందంగా ఉన్న అన్నపూర్ణ స్టూడియో అప్పట్లో ఎలా ఉందో చూసేయండి.