- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యూట్యూబ్ ట్రెండింగ్ వన్‌లో నాగచైతన్య సాంగ్.. పోస్ట్ వైరల్

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ మూవీ ‘తండేల్’(Thandel). సముద్ర బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాకి చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. రీసెంట్‌గా వచ్చిన హైలోస్సో హైలెస్సా సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్ ట్రెండింగ్ నెంబర్ వన్‌లో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీ నుంచి వచ్చిన బుజ్జితల్లి(Bujji Thalli), నమో నమ: శివాయ(Namo Namah Shivaya) సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.