Mohanlal: మోహన్‌లాల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ఎల్-2: ఎంపురాన్’ మూవీ టీజర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్

by Hamsa |   ( Updated:2025-01-23 11:21:25.0  )
Mohanlal: మోహన్‌లాల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ఎల్-2: ఎంపురాన్’ మూవీ టీజర్  రిలీజ్‌కు టైమ్ ఫిక్స్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) వరుస చిత్రాల్లో నటించడంతో పాటు పలు ప్రాజెక్ట్స్‌లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఎల్-2: ఎంపురాన్’(L2: Empuraan). ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) దర్శకత్వం వహిస్తుండగా.. టోవినో థామస్(Tovino Thomas), మంజు వారియర్(Manju Warrier) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దీపక్ దేవ్(Deepak Dev) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2019లో వచ్చిన ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా రాబోతుంది. దీనిని ప్రముఖ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ‘ఎల్-2:ఎంపురాన్’ మూవీ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుంది. రిపబ్లిక్ డే స్పెషల్‌గా ‘ఎల్-2: ఎంపురాన్’ టీజర్‌ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు పృథ్వీ రాజ్ సుకుమారన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Next Story

Most Viewed