Meenakshi Chaudhary: మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన క్రేజీ హీరోయిన్

by sudharani |
Meenakshi Chaudhary: మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన క్రేజీ హీరోయిన్
X

దిశ, సినిమా: ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తెలుగు (Telugu), తమిళ (Tamil) భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. గతేడాది ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaskar)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న మీనాక్షి.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చిత్రంతో తన గ్రాఫ్ మరింత పెంచుకుంది. దీంతో ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ హంగామా చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ చేతిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలతో పాటు.. మరో రెండు, మూడో ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా అయిపోయింది.

ఇక త్వరలో మరిన్ని సినిమాలు అనౌన్స్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా(Social media)లో మాత్రం ఫుల్ యాక్టివ్‌ ఉంటోంది ఈ బ్యూటీ. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రోఫిషనల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తుంది. అంతే కాకుండా.. వరుస బ్లాక్ బస్టర్స్‌తో దూసుకుపోతున్న మీనాక్షి.. ఈ మధ్య కాలంలో గ్లామర్ (glamour) డోస్ మరింత పెంచి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది ఈ హీరోయిన్. రీసెంట్‌గా చెన్నైలో ఓ ఈవెంట్‌కు హాజరైన మీనాక్షి.. అక్కడ చాలా అందమైన సమయాన్ని గడిపినట్లు చెప్పుకొచ్చింది. అలాగే.. అక్కడ ప్రజలపై తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అని తెలుపుతూ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

Advertisement
Next Story

Most Viewed