- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లి చేసుకున్న బుల్లితెర హీరోయిన్.. క్యూట్ కపుల్ అంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: బుల్లితెరలో ప్రసారమయ్యే ‘ప్రేమ ఎంత మధురం’ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కన్నడ బ్యూటీ వర్ష గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్లో అను పాత్ర ద్వారా తెలుగు ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం గౌరీ పాత్రలో నటిస్తుంది. ఈ భామ ఈ ధారావాహిక కంటే ముందు కన్నడలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా వర్ష తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు కూడా నటుడే. కన్నడలో అనేక సీరియల్స్ చేశాడు.
అయితే వీరిద్దరు కొన్నాళ్లుగా స్నేహితులు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో వీరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కన్నడ బ్యూటీ వర్ష- కౌశిక్ నాయుడు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ నూతన జంటకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.