- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kannappa: ఎంతగానో ఆశీర్వదించబడ్డాను.. వైరల్‌గా మంచు విష్ణు ట్వీట్

దిశ, సినిమా: డైనమిక్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు (Mohan Babu) భారీగా నిర్మిస్తు్న్న ఈ ప్రాజెక్ట్‌కి ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. అంతే కాకుండా.. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ చేతుల మీద ఈ పాటను విడుదల చేశారు. బెంగుళూరులోని శ్రీ శ్రీ రవిశంకర్ ఆశ్రమంలో డా.మోహన్ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్‌లైన్ వెంకటేష్, నటి సుమలత, భారతి విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, నటుడు అర్పిత్ రాంకా, రామజోగయ్య శాస్త్రితో సహా కన్నప్ప బృందంతో ఈ పాటను రిలీజ్ చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను మంచు విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ.. ‘శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ తన నిర్మలమైన ఆశ్రమంలో ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఆవిష్కరించడంతో నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. కాగా.. ‘శివా శివా శంకరా’ అంటూ సాగే ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఎంతో పాజిటివిటీని పెంచేలా ఉన్న ఈ పాటతో కన్నప్ప మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.