Mad Square: ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ చూశారా.. పొట్టచెక్కలు అయ్యేలా నవ్వడం ఖాయం!

by sudharani |   ( Updated:2025-02-25 10:59:25.0  )
Mad Square: ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ చూశారా.. పొట్టచెక్కలు అయ్యేలా నవ్వడం ఖాయం!
X

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’ (Mad)కి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ (sequel) ప్రకటించినప్పటి నుండి సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి టీజర్ (Teaser) రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ సోషల్ మీడియా (Social media)లో వైరల్ అవుతూ విశేష స్పందన అందుకుంటోంది. ఇందులో నటీనటుల అల్లరి, పంచ్ డైలాగ్‌లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. దీంతో ఈ వేసవికి ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్‌తో స్పష్టం చేశారు మేకర్స్.

కాగా.. కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నార్నే నితిన్ (Narne Nitin), సంగీత్ శోభన్ (Sangeet Shobhan), రామ్ నితిన్ (Ram Nitin) అండ్ విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. భీమ్స్ సిసిరోలియో (Bheems Cicerolio) సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని, ఎక్కువ మ్యాడ్ నెస్‌ను ‘మ్యాడ్ స్క్వేర్’లో చూడబోతున్నారని చిత్ర బృందం చేసిన కామెంట్స్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Next Story