- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిలో సమంతను ఫాలో అయిన లావణ్య.. ఆమె చేసిన పనికి ఏం జరగబోతుందోనని భయపడుతున్న ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్-లావణ్య ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్‌తో మిస్టర్ మూవీలో నటించింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉండి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి ఓ సినిమాలో లావణ్య చెప్పిన డైలాగ్‌ను నిజం చేసేసింది. తన పెళ్లికి చిరంజీవి వస్తాడని కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన డైలాగ్ నిజ జీవితంలో జరిగింది. మొత్తానికి ఈ అమ్మడు మెగా కోడలుగా అడుగుపెట్టేసింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నవంబర్ 5న రిసెప్షన్ కూడా ఘనంగా చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, లావణ్య, పెళ్లిలో సమంతను ఫాలో అయిందని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెగా కోడలు తన పెళ్లిలో ఎరుపు రంగు, గోల్డ్ కలర్ బార్డర్ కాంచీపురం చీరలో మరింత అందంగా కనిపించింది. అయితే ఈ చీరను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా వరుణ్ తేజ్ ను మెగా ఫ్యామిలీ, ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగా ‘వరుణ్’ అని పిలుస్తారు. మరి, లావణ్య త్రిపాఠిని ‘లావ్’ అని అంటుంటారు. రెండు ముద్దు పేర్లను కలిపి శారీ మీద తెలుగులో రాయించుకుని వాటి పక్కన ఇన్ఫినిటీ సింబల్‌ను లావణ్య పెట్టించుకున్న సంగతి తెలిసిందే.. అయితే గతంలో సమంత కూడా చీర అంచు అంతా నాగచైతన్య, సమంత అని ఇన్ఫిని సింబల్‌తో సహా రాయించుకుందని సమాచారం. ఇక ఇప్పుడు లావణ్య కూడా ఆమెను ఫాలో అయి అలాగే చేసింది. దీంతో ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ సమంత జీవితంలా లావణ్య లైఫ్ కూడా అవుతుందేమోనని భయపడిపోతున్నారు. కొందరైతే ఏది ఏమైనప్పటికీ వరుణ్-లావణ్య ఒక్కటయ్యారు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.