- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘చీకటి గ్రహాల ఎంపురాన్’గా మలయాళ సూపర్‌స్టార్.. హైప్ పెంచుతున్న L2E: ఎంపురాన్ ట్రైలర్

దిశ, సినిమా: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘L2:ఎంపురాన్’(L2: Empuraan). అయితే ఈ చిత్రం 2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా రాబోతుంది. అయితే ఈ మూవీ మూడు భాగాలుగా రాబోతుండగా.. ఇది రెండో భాగం కావడం విశేషం. మలయాళ చిత్రసీమలోనే అత్యంత భారీ చిత్రంగా ‘L2E: ఎంపురాన్’సినిమాను ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. అయితే ‘ఎంపురాన్-2’ను తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) విడుదల చేస్తుండగా హిందీలో అనీల్ తడానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కర్ణాటకలో ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్(Hombale Films) రిలీజ్ చేస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్(Manju Warrier), సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్(Kartikeya Dev) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ‘L2E: ఎంపురాన్’ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో ట్రైలర్ విడుదల చేయటమే కాదు, మీడియాకు కూడా ఇదే తరహాలో ప్రత్యేకమైన షోను ప్రదర్శించనుండటం విశేషం. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘L2E: ఎంపురాన్’సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇందులో ‘‘నా బిడ్డలు కారు నన్ను ఫాలో అయితే.. నన్ను ఫాలో అయినవాళ్లే నా బిడ్డలు. పి.కె.రాందాస్‌గారు మిగిల్చి వెళ్లిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా కూల్చాలని ప్రయత్నించింది నా ముందు నిల్చుని ఎదిరించిన శత్రువులు కాదు. మనదేశంలో రాజనీతి ఓ వ్యాపారం. మనుషుల ప్రాణాల కంటే ఓ రక్త సంబంధానికైనా విలువ ఉంటుందని నేను అనుకోవటం లేదు. స్టీఫెన్ ఎక్కడ.. అతని కళ్లు అన్నింటినీ చూస్తున్నాయి. చీకటి గ్రహాల ఎంపురాన్.. కేరళ రాష్ట్రంలో ఓ సాధారణ ఎమ్మెల్యే అతను. అతన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మనకు తెలియంది ఏదో ఒకటి స్టీఫెన్ నెడుంపల్లి కథలో ఉంది. దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్‌ను కాకుండా ఎవర్ని సాయం అడగగలం. స్టీఫెన్ మళ్లీ తిరిగి వచ్చి నీ మనిషిని, దైవానికి ఆత్మలాంటి దేశాన్ని కాపాడుకో’’ అనే డైలాగ్స్ అందరిలో హైప్ పెంచుతోంది.
Read More..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎం.ఎస్ ధోని న్యూ యాడ్.. సినిమా రేంజ్‌లో ఉందంటున్న ఫ్యాన్స్