Kingston Movie Review: ‘కింగ్ స్టన్’ మూవీ రివ్యూ.. సముద్రంలో హార్రర్‌తో భయపెట్టారు, కానీ..

by Kavitha |
Kingston Movie Review: ‘కింగ్ స్టన్’ మూవీ రివ్యూ.. సముద్రంలో హార్రర్‌తో భయపెట్టారు, కానీ..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్(Gv Prakash) హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘కింగ్‌స్టన్‌’. ఇక ఇందులో దివ్యభారతి(Divya Bharathi) హీరోయిన్‌గా నటించగా చేతన్ కాదంబి(Chethan Kadambi), అజగన్ పెరుమాళ్, సాబుమాన్ అబ్దుసమద్, ఎలాంగో కుమారవేల్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే పేర్లల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్ పై GV ప్రకాష్ సొంత నిర్మాణంలో కమల్ ప్రకాష్(Kamal Prakash) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్‌లో తెరకెక్కిన కింగ్ స్టన్ సినిమా డబ్బింగ్‌తో తెలుగులో కూడా నేడు (మార్చి 7న) రిలీజయింది.

ఇక కథ విషయానికొస్తే.. 1982లో సముద్ర తీరంలోని ఓ గ్రామంలో బోసయ్య(అజగన్ పెరుమాళ్) అనే వ్యక్తిని ఊరంతా కలిసి చంపేసి పాతి పెడతారు. అది ఆత్మ అయి గ్రామస్థులను భయం పెడుతుండటంతో ఆ శవాన్ని సముద్రంలో పడేస్తారు. సముద్రంలోకి ఎవరు వెళ్లినా శవాలుగా తిరిగి వస్తుండటంతో ఆ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లొద్దని, ఆ ఊరి సముద్రానికి కంచె వేస్తారు. ఆ ఊరి వాళ్లకు పని పోవడంతో అక్కడ నుంచి వెళ్లి మరో సముద్రం ఉన్న సిటీలో సెటిల్ అయిన థామస్ అనే రౌడీ వాళ్లకు పని ఇస్తాడు.

ప్రస్తుతం 2025లో కింగ్ స్టన్(జీవి ప్రకాష్ కుమార్) థామస్(సాబుమాన్ అబ్దుసమద్) వద్దే డబ్బు కోసం పని చేస్తుంటాడు. థామస్ చెప్పినట్టు సముద్రంలోకి వెళ్లి శ్రీలంక బోర్డర్ లో అక్రమంగా ఏదో తరలిస్తూ ఉంటారు కింగ్ స్టన్ అతని స్నేహితులు. ఓ రోజు సముద్రంలో నేవీ అధికారులు వాళ్లపై అటాక్ చేయడంతో ఒక పిల్లాడు చనిపోతాడు. దీంతో థామస్ వాళ్ళతో డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నాడని తెలిసి కింగ్ స్టన్ అతనికి ఎదురు తిరిగి తన ఊరి వాళ్ళు ఎవరూ కూడా ఇక అతని దగ్గరికి పనికి రారు అని చెప్తాడు. ఊర్లో మూసేసిన సముద్రంలోకి వేటకు వెళ్లి చేపలు పట్టుకొస్తే ఊరి వాళ్ళు ఆత్మలు, దయ్యాలు లేవని నమ్ముతారని కింగ్ స్టన్ అతని స్నేహితులు థామస్ ని కూడా తీసుకొని మూసేసిన సముద్రంలోకి వెళ్తారు.

కింగ్ స్టన్ గర్ల్ ఫ్రెండ్ రోజ్(దివ్య భారతి)కూడా వాళ్ళ షిప్‌లో వెళ్తుంది. మరి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళాక ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అక్కడ దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? వీళ్లంతా తిరిగి వచ్చారా? అసలు సముద్రంలోకి వెళ్లిన వాళ్లంతా ఎందుకు చనిపోతున్నారు? బోసయ్యని ఎందుకు చంపారు? సముద్రంలో బోసయ్య ఆత్మ ఉందా? థామస్ కి ఆ ఊరికి సంబంధం ఏంటి అనేదే మూవీ కథాంశం.

సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ అంతా తమిళ్ నేటిటివిటిలో ఉండే ఓ మత్స్యకారుల గ్రామం బ్యాక్ డ్రాప్‌లోనే చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఏదో ఒకటి రెండు సార్లు భయపెట్టినా సెకండ్ హాఫ్‌లో మాత్రం బాగానే భయపెట్టారు. సముద్రంలో సీన్స్ అయితే అదిరిపోయాయి. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్స్ కూడా ఆసక్తికరంగా అంటాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే కొన్ని ట్విస్టులు బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే తమిళ పాత్రలు, తమిళ్ పేర్లు, కథ ముందుకి వెనక్కి వెళ్లడంతో అక్కడక్కడా కాస్త కన్ఫ్యూజ్ ఉంటుంది. అయితే జీవి చెప్పినట్టు ఆ ఫాంటసీ వరల్డ్, హారర్ ఇంకా ఎక్కువ సేపు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫైనల్‌గా ఈ మూవీ యావరేజ్ అనే చెప్పాలి.


Next Story