థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న కార్తీ క్లాసికల్ మూవీ.. ట్రైలర్ చూశారా

by Kavitha |
థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న కార్తీ క్లాసికల్ మూవీ.. ట్రైలర్ చూశారా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అత్యధిక సినిమాలు రీ రిలీజ్(Re Release) అయ్యాయి. అయితే ఈ ఏడాదిలోనూ అప్పుడే రీ రిలీజ్ సందడి షురూ అయింది. మొన్న వాలంటైన్స్‌డే సందర్భంగా పలు సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం విదితమే. మార్చి నెలలోనూ మూడు హిట్‌ సినిమాల రీ రిలీజ్‌కి డేట్లు ప్రకటించారు. అందులో కార్తీ(Karthi) హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు' (Yuganiki Okkadu) సినిమా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మార్చి 14న రీ రిలీజ్‌ చేయబోతున్నారు. తమిళ్‌ వర్షన్‌ 'ఆయిరథిల్ ఒరువన్' కంటే తెలుగులో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికీ యుగానికి ఒక్కడు సినిమాలోని రేయ్‌ ఎవర్రా మీరంతా... అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, అమెరికాలోనూ యుగానికి ఒక్కడు రీ రిలీజ్ చేయనున్నారు. 15 ఏళ్ల క్రితం వచ్చిన యుగానికి ఒక్కడు సినిమా ఇప్పుడు థియేట్రికల్‌ రీ రిలీజ్ అనగానే కార్తీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చోళ రాజుల ప్రతాపంను చూసేందుకు రెడీగా ఉన్నామంటూ ప్రేక్షకులు టికెట్‌ బుకింగ్స్‌కి రెడీ అవుతున్నారు.

ఇలాంటి కల్ట్ సినిమాల రీ రిలీజ్‌లతో నిర్మాతలు మరోసారి భారీ మొత్తంలో లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక సెల్వ రాఘవన్‌(SELVA RAGHAVAN) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించగా ముఖ్య పాత్రల్లో రీమా సేన్‌(REMASEN), ఆండ్రియా(Andriaya), పార్తిబన్‌(Parthiban), అభినయ(Abhinaya) ఇంకా ప్రముఖ తమిళ నటీనటులు నటించారు. సినిమాకి జీవి ప్రకాష్‌ కుమార్‌(GV Prakash Kumar) సంగీతాన్ని అందించారు. ఆర్ రవీంద్రన్‌ (R Ravindren)తో కలిసి సెల్వ రాఘవన్ ఈ సినిమాను నిర్మించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రీరిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ‘పాండ్య రాజు చేతిలో నా వంశము అంతమొందవలెను అనెను కావున నా కుమారున్ని మీరు పెంచవలెను. వీడిని మీకు అప్పగించుతున్నాను’ అని స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

Next Story