వాటిని నమ్మకండి .. నన్ను ఎవరు తీసేయలేదు: Jani Master

by Prasanna |   ( Updated:2024-12-13 15:57:41.0  )
వాటిని నమ్మకండి .. నన్ను ఎవరు తీసేయలేదు: Jani Master
X

దిశ, వెబ్ డెస్క్ : కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ ( Jani Master) ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి తొల‌గించారంటూ ఓ వార్త నెట్టింట బాగా వైర‌ల్‌ అయింది. తాజాగా, ఈ విషయం పై జానీ మాస్ట‌ర్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. వాటిని నమ్మకండి.. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేద‌ని ఖండించారు.

" నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ఇదంతా ఫేక్ .. న‌న్ను ఎవరు ఏ అసోసియేషన్ నుంచి తొల‌గించ‌లేదు. నా కార్డును ఎవ‌రు తీసేయ‌లేదు. నేను ఇప్ప‌టికే డ్యాన్సర్ అసోసియేషన్‌లోనే ఉన్నాను. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో గేమ్ ఛేంజర్ నుండి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది " అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story

Most Viewed