Janhvi Kapoor: కొత్త సినిమా నుంచి జాన్వీ కపూర్ లుక్ రిలీజ్.. కూల్ అండ్ లవ్లీ లుక్‌లో ఆకట్టుకుంటున్న బ్యూటీ

by sudharani |   ( Updated:2024-12-24 16:17:51.0  )
Janhvi Kapoor: కొత్త సినిమా నుంచి జాన్వీ కపూర్ లుక్ రిలీజ్.. కూల్ అండ్ లవ్లీ లుక్‌లో ఆకట్టుకుంటున్న బ్యూటీ
X

దిశ, సినిమా: ‘దేవర’ (Devara)తో టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’. బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ తుషార్ జలోటా (Tushar Jalota) తెరకెక్కిస్తున్నాడు. ఓ స్వచ్ఛమైన ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి వరుస అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఈ క్రమంలోనే మొదట హీరో ఫస్ట్ లుక్ (First Look) విడుదల చేయగా.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘జాన్వీకపూర్‌ని సౌత్‌కి సుందరిగా పరిచయం చేస్తున్నాను. ఆమె లుక్‌తో మీ హృదయాన్ని కరిగించేస్తుంది. పరమ్ సుందరి 25 జూలై 2025న థియేటర్లలో విడుదలవుతోంది.. సిద్ధంగా ఉండండి’ అని తెలిపారు. విడుదల చేసిన పోస్టర్‌లో కూల్ అండ్ లవ్లీ లుక్‌తో ఆకట్టుకుంటోంది జాన్వీ కపూర్.

Advertisement

Next Story

Most Viewed