Allu Arjun: నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్

by Hamsa |
Allu Arjun: నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ మూవీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. థియేటర్స్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అల్లు అర్జున్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఆయన నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తి కావడంతో అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

అయితే 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలై 5 ఏళ్లు పూర్తి కావండంతో అల్లు అర్జున్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ‘‘అల వైకుంఠపురములో 5 సంవత్సరాలు పూర్తి అయ్యాయి! ఈ చిత్రం నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక తీపి స్థానాన్ని కలిగి ఉంటుంది. త్రివిక్రమ్ , చినబాబు , అల్లు అరవింద్(Allu Aravind), థమన్ అన్నయ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అద్భుత చిత్రానికి జీవం పోసినందుకు కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చారు. అలాగే చిత్రంలో భాగం అయిన వారందరి ఫొటోలను షేర్ చేశారు.

Next Story

Most Viewed