- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Akkineni Akhil: అక్కినేని అఖిల్ మూవీస్ ఫ్లాప్ అవ్వడానికి అసలు కారణం ఇదేనా..!

దిశ, వెబ్ డెస్క్ : నాగార్జున తనయుడిగా " అక్కినేని అఖిల్ " ( Akkineni Akhil ) తెలుగులోకి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ యంగ్ హీరో ప్రతి మూవీ కోసం చాలా కష్ట పడతాడు .. అయినప్పటికీ సరైన హిట్ ఇంతవరకు అందుకోలేదు. ఏజెంట్ మూవీ హిట్ అవుతుందని అనుకున్నారు కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అఖిల్ ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డాడు. దీనిలో సిక్స్ ప్యాక్ బాడీతోపాటు.. మాస్ లుక్ లో కనిపించినా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.
" ఏజెంట్ " మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ఈ మూవీ నిర్మాతే " మా చిత్రం ఫెయిల్ అయిందని " చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ యంగ్ హీరో కొత్త సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏమి రాలేదు. దీంతో, అసలు అఖిల్ మూవీస్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటని అన్న చర్చ మొదలైంది.
అయితే, అతని చిత్రాలు ఫ్లాప్ కావడానికి కారణం ఇదనేంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగేశ్వర్ రావు నుంచి నాగ చైతన్య వరకు అందరి పేర్లలో ‘నాగ’ వచ్చింది. అంటే, నాగమ్మ దయతో అందరికి కలిసి రావాలని ఆ పేరు పెట్టినట్టు కుటుంబ సభ్యులు పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. అయితే, అఖిల్ విషయానికొచ్చేసరికి పేరులో నాగ లేదు. అందుకే, అన్నీ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. తన అన్న నాగ చైతన్య పెద్ద స్టార్ కాకపోయినా కొన్ని సినిమాలైతే హిట్ అయ్యాయి. ఇతనికి అది కూడా లేదని, దాని వలనే చిన్నోడి కెరియర్ ముందుకు సాగడం లేదని టాక్ నడుస్తుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.