- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kraven The Hunter: విడుదల నేపథ్యంలో సినిమా స్టోరీ చెప్తూ హైప్ పెంచుతోన్న డైరెక్టర్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: చందూర్(Chandur) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం క్రావెన్: ది హంటర్(Kraven The Hunter). ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సోనీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. మోస్ట్ అవైటెడ్ సినిమా క్రావెన్: ది హంటర్ మూవీలో అలెసాండ్రో నీవోలా(Alessandro Nievola), రస్సెల్ క్రౌ(Russell Crowe), అరియానా డీ బోస్(Arianna Dee Bos), క్రిస్టోఫర్ అబ్బాట్(Christopher Abbott), ఫ్రెడ్ హెచ్చింగర్(Fred Hechinger) వంటి నటీనటులు ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు,హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషల్లో ఈ మూవీ వచ్చే ఏడాది (2025) జనవరి 1 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
అయితే తాజాగా మీడియా సమావేశంలో ఈ చిత్ర దర్శకుడు చందూర్ మాట్లాడుతూ.. క్రావెన్: ది హంటర్ మూవీకి ఆర్ రేటింగ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని వెల్లడించారు. అంతేకాకుండా ఈ రేటింగ్‌తో సినిమాకు పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నానని తెలిపారు. ఈ స్టోరీ ప్రజలకు అత్యంత అద్భుతంగా చూపించడం అవసరమని వివరించారు. అలాగే ఈ మూవీలో ఆవేశంతో సెర్గీ అనే క్యారెక్టర్ పోషించిన వ్యక్తి ఇద్దరి పిల్లల్ని టీనేట్‌లో చంపేస్తాడని పేర్కొన్నారు. ఇక్కడ చావు నుంచి తప్పించుకుని బతికే చాన్స్ ఉంటుంది.. కానీ అలా చెయ్యడని.. అందుకు కూడా ఓ రీజన్ ఉంటుందని.. అదే ఈ చిత్రంలో ముఖ్యమైన అంశమని డైరెక్టర్ చందూర్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ దర్శకుడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More...
OTT PlatForms : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం వార్నింగ్