- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘8 వసంతాలు’ నుంచి ఆకట్టుకుంటున్న అందమా అందమా లిరికల్ ప్రోమో.. ఫుల్ పాట వచ్చేది అప్పుడే (ట్వీట్)

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనంతిక సునీల్ కుమార్(ananthika Sunil Kumar) అందరికీ సుపరిచితమే. ‘మ్యాడ్’(MAD) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. తన అందం, అభినయంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘8వసంతాలు’(8 Vasanthalu). ఫణీంద్ర(Phanindra) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. రవితేజ దుగ్గిరాల(Raviteja Duggirala) హీరోగా నటిస్తున్నాడు.
ఇక హను రెడ్డి(Hanu Reddy), సంజన(Sanjana), కన్నా పసునూరి(Kanna Pasunoori), స్వరాజ్ రెబ్బా ప్రగడ(Swaraj Rebbapragada), సమీరా కిశోర్(Sameera Kishore) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే దీనిని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ పై నిర్మిస్తుండగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. ఇక బ్యూటీఫుల్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్ బ్రేకప్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని ఈ సినిమాపై అందరిలో క్యూరియాసిటీని పెంచాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ ఫుల్ లిరికల్ సాంగ్ రేపు సాయంత్రం 4గంటలకు రానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక లిరికల్ సాంగ్.. ‘అందమా అందమా నువ్వు నా సొంతమా’..అంటూ సాగే లిరికల్ ప్రోమో మెలోడియస్‌గా మైమరిపిస్తుంది. ఇక దీనికి వనమాలి లిరిక్స్ అందించగా.. హేషమ్ అబ్దుల్ వాహాబ్, అవని మల్హర్ ఆలపించారు.