Monalisa:ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తీసుకున్న కుంభమేళా బ్యూటీ.. ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!?

by Jakkula Mamatha |
Monalisa:ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తీసుకున్న కుంభమేళా బ్యూటీ.. ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్‌(Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela)లో ఆకర్షించే కళ్లతో ఫేమస్(Famous) అయిన తేనేకళ్ల బ్యూటీ మోనాలిసా(Monalisa) గురించి తెలిసిందే. ప్రయోగరాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాకు మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని ఇండోర్‌(Indore)కి చెందిన మోనాలిసా తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చి.. కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మోనాలిసాను చూసిన కొందరు యూట్యూబర్‌లు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ చేశారు.

దీంతో రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన.. ఈ తేనేకళ్ల బ్యూటీ ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా ఎదిగింది. ఈ క్రమంలో మోనాలిసాకు బాలీవుడ్‌లో ఓ సినిమా ఆఫర్ కూడా వచ్చింది. ఈ తరుణంలో 'ది డైరీ ఆఫ్ మణిపూర్'(The Diary of Manipur) అనే సినిమా(Movie)లో లీడ్ రోల్‌లో నటించేందుకు మోనాలిసా అంగీకరిస్తూ సంతకం కూడా చేసింది. ఈ క్రమంలో మోనాలిసాకు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మోనాలిసా నటిస్తోన్న మొదటి సినిమా(ది డైరీ ఆఫ్ మణిపూర్) రెమ్యూనరేషన్(Remuneration) గురించి నెట్టింట టాక్ వినిపిస్తోంది.

అది ఏంటంటే.. తేనేకళ్ల సుందరీ మోనాలిసా తన ఫస్ట్ మూవీకి గాను రెమ్యూనరేషన్‌గా రూ.21లక్షలు తీసుకుందని సమాచారం. అంతేకాకుండా లోకల్ బిజినెస్ ప్రమోషన్స్(Local Business Promotions) కోసం రూ.15 లక్షలతో డీల్ చేసుకుందట. అయితే ఈ బ్యూటీ పూసలమ్మి రోజుకు రూ.1000 సంపాదిస్తే చాలనుకున్న మోనాలిసాకు ఇప్పుడు డబ్బుతో పాటు దేశవ్యాప్తంగా ఫేమ్ వచ్చింది. దీంతో లక్కంటే ఇదేనేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed